Congress: రాజ్యాంగ రక్షణ దీక్షలో మోత్కుపల్లిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

Congress leaders fires at Mothkupalli

  • గాంధీ భవన్‌లో రాజ్యాంగ రక్షణ దీక్ష
  • దీక్షలో పాల్గొన్న చంద్రశేఖర్, మానవతా రాయ్, సతీష్ మాదిగ
  • సీటు రాలేదనే మోత్కుపల్లి దీక్ష చేపట్టారని విమర్శలు

సీటు రాలేదనే మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత నేతలు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ దళిత నేతలు రాజ్యాంగ రక్షణ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు దేశ్ కి బచావో... మోదీకి హఠావో అని నినాదాలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఈ దీక్ష ముగిసింది. ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రశేఖర్, మానవతారాయ్, సతీష్ మాదిగ, వీహెచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బీజేపీపై మండిపడ్డారు. రిజర్వేషన్లపై బీజేపీ అనుసరిస్తున్న విధానాలు సరికాదన్నారు.

More Telugu News