KL Narayana Interview: శ్రీహరి అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు: నిర్మాత కేఎల్ నారాయణ

KL Narayana Interview

  • 30 ఏళ్లు పూర్తిచేసుకున్న 'హలో బ్రదర్'
  • ఫస్టు టైమ్ నాగ్ ద్విపాత్రాభినయం చేసిన మూవీ 
  • శ్రీహరి గొప్పగా కామెడీ చేశారన్న నిర్మాత 
  • ఈవీవీతో మంచి అనుబంధం ఏర్పడిందని వెల్లడి


ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన 'హలో బ్రదర్' సినిమా, 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేఎల్ నారాయణ నిర్మించిన ఈ సినిమాకి, రాజ్ కోటి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 30 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను గురించి, తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ నారాయణ ప్రస్తావించారు. 

"ఈవీవీ సత్యనారాయణగారు ఈ కథను చెప్పగానే నాగార్జునగారు వెంటనే ఓకే చెప్పారు. అందుకు కారణం అప్పటివరకూ నాగార్జునగారు డ్యూయెల్ రోల్ చేయలేదు. అందువలన కొత్తగా ఉంటుందని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక హీరోయిన్స్ విషయంలో మరో ఆప్షన్ గురించిన ఆలోచనే లేదు. ఎవరినైతే ముందుగా అనుకున్నామో వారినే తీసుకున్నాం" అని అన్నారు. 

ఈ సినిమాలో శ్రీహరి కామెడీ చేశారు. అప్పటివరకూ విలన్ తరహా వేషాలు వేస్తూ వచ్చిన శ్రీహరి, ఈ సినిమాలో కామెడీ చేయడం విశేషం. ఆయన ఇంత బాగా కామెడీ చేయగలరా అని అంతా ఆశ్చర్యపోయారు. శ్రీహరి గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో ఒకటిగా ఇది నిలిచింది. ఇక ఈ సినిమా దగ్గర నుంచి మాకు ఈవీవీతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన స్టార్ డైరెక్టర్ అయిన తరువాత కూడా అలాగే ఉంటూ రావడం గొప్పవిషయం" అని చెప్పారు.

KL Narayana Interview
Hello Brother
EVV
  • Loading...

More Telugu News