Nidhi Agerwal: అదృష్టానికి దగ్గరలో అందాల నిధి!

Nidhi Agerwal Special

  • అందంతో మెప్పించిన నిధి అగర్వాల్  
  • ఆరంభంలోనే యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీ 
  • నిదానంగా సాగుతున్న కెరియర్ 
  • చేతిలో పవన్ .. ప్రభాస్ సినిమాలు  


ఈ మధ్య కాలంలో వెండితెరకి పరిచయమయ్యే హీరోయిన్స్ .. కాస్తంత అందం ఉంటే చాలు, తమకి తాముగా మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. చాలామంది చాలా తేలికగా స్టార్ హీరోయిన్స్ దరిదాపుల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ చక్కని కనుముక్కుతీరుతో .. యూత్ హృదయాలను పొలోమంటూ పడగొట్టిన నిధి అగర్వాల్ మాత్రం అదృష్టానికి దగ్గరలోనే ఆగిపోయింది. నిధి అగర్వాల్ తన కెరియర్ ను మొదలుపెట్టి ఏడేళ్లు దాటిపోయింది. ఈ ఏడేళ్లలో ఆమె ఏడు సినిమాలు మాత్రమే చేసింది. సాధారణంగా ఒక భాషలో ఒక హీరో ఒక సినిమా చేసేలోగా హీరోయిన్స్ ఓ మూడు నాలుగు సినిమాలు చేసేస్తూ ఉంటారు. కానీ నిధి అగర్వాల్ మొదటి నుంచి కూడా ఈ విషయంలో వెనకబడే ఉంది. యూత్ లో తనకున్న క్రేజ్ ను ఆయుధంగా చేసుకుని ముందుకు దూసుకెళ్లలేకపోయింది. నిజానికి నిధి అగర్వాల్ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన ఆ స్థాయి బ్యూటీలు చాలా తక్కువ. తెలుగులో కంటే బాలీవుడ్ లో ఆమె ఎక్కువగా సక్సెస్ అవుతుందని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఆమె తన కెరియర్ ను పరిగెత్తించే విషయంలో చాలా బద్ధకంగా ఉందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'హరిహర వీరమల్లు' .. 'రాజా సాబ్' సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల హిట్ తోనైనా ఆమె కెరియర్ పుంజుకుంటుందేమో చూడాలి. 

Nidhi Agerwal
Actress
Pavan Kalyan
Prabhas
  • Loading...

More Telugu News