Sonakshi Sinha: భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా 'హీరామండి' .. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Heeramandi web series update

  • బాలీవుడ్ వెబ్ సిరీస్ గా 'హీరామండి'
  • దర్శకనిర్మాతగా వ్యవహరించిన సంజయ్ లీలా భన్సాలీ 
  • ప్రధానమైన పహారాలో సోనాక్షి - మనీషా 
  • రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్


ఇండియాలో ఒక వెబ్ సిరీస్ కోసం 200 కోట్లను ఖర్చుపెట్టడం ఇంతవరకూ జరగలేదు. అది ఒక్క 'హీరామండి' సిరీస్ విషయంలోనే జరిగింది. అందుకే ఇప్పుడు ఈ సిరీస్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంతవరకూ చెప్పుకోదగిన సినిమాలను నిర్మిస్తూ వచ్చిన సంజయ్ లీలా భన్సాలీకి ఇది తొలి వెబ్ సిరీస్. ఈ సిరీస్ కి నిర్మాత కూడా ఆయనే కావడం విశేషం. 

అలాంటి ఈ సిరీస్ మరికొన్ని గంటల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ సమయం కోసమే అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వం, పాకిస్థాన్ లోని లాహోర్ లో వేశ్యల విలాసవంతమైన జీవితం .. స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. సహజత్వానికి దగ్గరగా ఈ సిరీస్ ను ఆవిష్కరించడం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. 

ఈ సిరీస్ లో నటించే ఆర్టిస్టులు .. బాలీవుడ్ లో భారీ క్రేజ్ ఉన్నవారు కావడం విశేషం. సోనాక్షి సిన్హా .. మనీషా కొయిరాలా .. అదితిరావు .. రిచా చద్దా .. తదితరులు నటించారు. వీరి పారితోషికానికే పెద్ద మొత్తంలో కేటాయించినట్టుగా సమాచారం. అందరి కంటే ఎక్కువ పారితోషికం సోనాక్షి సిన్హా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. రేపు స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉంటుందనేది చూడాలి మరి. 

Sonakshi Sinha
Maneesha Koirala
Richa Chadda
  • Loading...

More Telugu News