'బాక్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఇదే: నటి ఖుష్బూ
- ఖుష్బూ నిర్మాతగా రూపొందిన 'బాక్'
- మే 3వ తేదీన భారీ స్థాయి విడుదల
- తమన్నా ప్రత్యేక ఆకర్షణ అవుతుందని వ్యాఖ్య
- నిర్మాతగా హ్యాపీగా ఉన్నానని వెల్లడి
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఖుష్బూ బిజీగా ఉన్నారు. తాజాగా 'మహా మ్యాక్స్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'ఖుష్బూ' మాట్లాడుతూ, "తెలుగులో ఈ సినిమాకి 'బాక్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి? అని చాలామంది అడుగుతున్నారు. 'బాక్ అనేది ఈ సినిమాలోని దెయ్యం పేరు. అస్సాం జానపద కథలను పరిశీలిస్తే ఈ పేరుతో అక్కడి దెయ్యం కథలు ఎక్కువగా వినిపిస్తాయి. ఆ ప్రేరణతో తయారు చేసిన కథ కావడం వలన 'బాక్' అనే పేరు పెట్టడం జరిగింది" అని అన్నారు.
"ఈ సిరీస్ లో ముందుగా హన్సిక .. ఆ తరువాత త్రిష .. ఇప్పుడు రాశిఖన్నా .. తమన్నాను తీసుకోవడం వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదు. కథను బట్టి ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. తమన్నా పాత్ర ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. నేను .. సిమ్రాన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తాం. పోస్టర్స్ లో నేను కనిపించను .. నిర్మాతగా పోస్టర్ పై నా పేరు చూసుకోవడంలోనే నాకు సంతృప్తి ఉంది" అని చెప్పారు.