IPL 2024: ఐపీఎల్-17: కేకేఆర్ పై టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals won the toss and elected batting

  • ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు

ఐపీఎల్ 17వ సీజన్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఢీకొంటున్నాయి. పాయింట్ల పట్టికలో కోల్ కతా జట్టు రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆరోస్థానంలో ఉంది. నేటి మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా కోల్ కతా జట్టులోకి తిరిగొచ్చారు. అటు, ఢిల్లీ జట్టులో పృథ్వీ షా పునరామగనం చేశాడు. కుశాగ్రను జట్టు నుంచి తప్పించారు. 

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు 3 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. 13 పరుగులు చేసిన పృథ్వీ షా... వైభవ్ అరోరా బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ 8 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో అభిషేక్ పోరెల్, షాయ్ హోప్ ఆడుతున్నారు.

IPL 2024
Delhi Capitals
KKR
Eden Gardens
Kolkata
  • Loading...

More Telugu News