Janasenani: పిఠాపురం నుంచి ర్యాలీకి బయలుదేరిన జనసేనాని.. వీడియో ఇదిగో!

Janasena Chief Pawan Kalyan Election Rally From Pithapuram

  • పవన్ కల్యాణ్ ను చూసేందుకు భారీగా వచ్చిన అభిమానులు
  • కారులో నిలుచుని అభిమానులకు పవన్ అభివాదం
  • పవన్ కారుతో పాటే బయలుదేరిన ఫ్యాన్స్

జనసేన అధ్యక్షుడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురంలోని తన నివాసం నుంచి ఎన్నికల ర్యాలీకి బయలుదేరారు. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జనసేనాని కారులో బయలుదేరగా.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులు నినాదాలు చేస్తూ వెంటనడిచారు. ప్రతిపక్ష నేతల ఆరోపణల నేపథ్యంలో పిఠాపురంలోనే నివాసం ఉంటానని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు. సోమవారం ఇక్కడి నుంచే ఎన్నికల ర్యాలీకి బయలుదేరివెళ్లారు.

More Telugu News