YS Bharathi: పులివెందులలో ప్రజల నాడి ఎలా ఉందో చెప్పిన వైఎస్ భారతి.... వీడియో ఇదిగో!

YS Bharathi talks about Pulivendula people pulse
  • పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
  • ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని వెల్లడి
  • జగన్ చెబితే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్న వైఎస్ భారతి
  • చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఉంటుందని వ్యాఖ్యలు 
సీఎం జగన్ అర్థాంగి వైఎస్ భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో  తమకు ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. మీరు (మీడియా) కూడా చూస్తున్నారు కదా... ప్రజల నుంచి స్పందన బాగుంది అని వివరించారు. 

ఇక, సీఎం జగన్ నిన్న విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధి వైఎస్ భారతిని ప్రశ్నించారు. అందుకామె బదులిస్తూ... ఎవరేంటి అనేది మీడియానే చక్కగా చెప్పగలుతుందని అన్నారు. జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని... చంద్రబాబు చెబితే చేస్తాడో, చేయడో అనే సందేహం ఉంటుందని వైఎస్ భారతి అభిప్రాయపడ్డారు. 

జగన్ కు గత ఎన్నికల కంటే ఈసారి మంచి మెజారిటీ ఇవ్వాలని పులివెందుల ప్రజలు నిర్ణయించారని వ్యాఖ్యానించారు. 

పులివెందులలోనే కాకుండా కడప పార్లమెంటు స్థానంలోనూ ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు వైఎస్ భారతి స్పందిస్తూ... వైఎస్సార్ ఉన్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని, ఇవాళ కూడా రొటీన్ గానే ప్రచారానికి వచ్చానని చెప్పారు.
YS Bharathi
Jagan
Pulivendula
Chandrababu
YSRCP
TDP
Kadapa District

More Telugu News