Anupama: అనుపమ ఏ మాత్రం తగ్గడం లేదుగా!

Anpama Special

  • 'టిల్లు స్క్వైర్'లో అలరించిన అనుపమ 
  • షూటింగు దశలో ఉన్న 'పరదా' సినిమా 
  • గ్రామీణ యువతిగా కనిపించనున్న అనుపమ 
  • ఫస్టులుక్ తోనే యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీ


మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ నటన ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. నిత్యా మీనన్ .. సాయిపల్లవి తరువాత, గ్లామరస్ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూ, నటనతో మెప్పించే కథానాయికల జాబితాలో అనుపమ కూడా చేరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ హఠాత్తుగా అనుపమ తన పద్ధతిని మార్చుకుంటూ, 'టిల్లు స్క్వైర్'లో మెరిసింది. 

ఈ సినిమాలో గ్లామర్ ఘాటు పెంచేసింది. ఈ తరహా పాత్రలలో అనుపమను చూస్తామని అనుకోని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడాలంటే ఆ మాత్రం గ్లామర్ డోస్ పెంచాల్సిందే అని కొంతమంది సరిపెట్టుకున్నారు. ఇకపై అనుపమ ఇలానే దూకుడు చూపిస్తుందేమో అనుకున్నారు. 

కానీ అనుపమ తనకి ముందు నుంచి ఉన్న క్లీన్ ఇమేజ్ కి తగినట్టుగా 'పరదా' అనే ఒక సినిమా చేస్తోంది. విజయ్ - శ్రీనివాసులు - శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంటుగా వదిలిన ఫస్టులుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆచార వ్యవహారాలు ప్రభావితం చేసే ఒక సాధారణమైన గ్రామీణ యువతిగా అనుపమ కనిపిస్తోంది. పరిస్థితులను ఎదిరించి సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. 

Anupama
Parada Movie
Darshana Rajendran
  • Loading...

More Telugu News