Dubbing Janaki: నా జీవితంలో నాకు ఇష్టంలేనివే జరిగాయి: నటి డబ్బింగ్ జానకి

Dubbing Janaki Special

  • నటిగా .. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు 
  • వెయ్యి సినిమాలకి పైగా నటించిన జానకి 
  • ప్రేమ పెళ్లి చేసుకున్నానని వెల్లడి 
  • బ్రతకడం కోసం సినిమాల్లో నటించానని వివరణ


డబ్బింగ్ జానకి నటిగా అనేక చిత్రాలలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వెళ్లారు. 65 ఏళ్లుగా ఆమె నట ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నా చిన్నతనంలోనే నేను స్టేజ్ ఎక్కాను. అప్పటి నుంచి సినిమాల్లోకి వచ్చేవరకూ నాటకాలు ఆడుతూనే వచ్చాను. వెయ్యికి పైగా సినిమాలను పూర్తిచేశాను" అని అన్నారు. 

"నా చిన్నతనంలోనే సినిమా వాళ్లను గురించి చాలా చులకనగా మాట్లాడుకునేవారు. దాంతో ఎలాంటి పరిస్థితుల్లోను సినిమాల్లోకి వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఇక మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదానిని. ఒకసారి ఒక పుస్తకంలో ఆర్మీ వారిని గురించి చదివాను. అప్పటి నుంచి ఆర్మీవారిని పెళ్లి చేసుకోకూడదని బలంగా అనుకున్నాను" అని చెప్పారు. 

"ఆ తరువాత కొంతకాలానికి మతాంతర వివాహం చేసుకున్నాను. ఇంట్లో ఎవరికి ఇష్టం లేని విషయం అది. దాంతో ఇద్దరం కలిసి బతకడానికి మద్రాస్ వచ్చాము. అక్కడికి వెళ్లిన తరువాత సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. ఆయనేమో ఆర్మీలో పని చేయడానికి వెళ్లిపోయారు. అలా నా జీవితంలో నేను ఏ విషయాల జోలికైతే వెళ్లకూడదని అనుకున్నానో .. వాటితోనే కలిసి జీవించాను" అని చెప్పారు.

Dubbing Janaki
Actress
Tollywood
  • Loading...

More Telugu News