Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. డేట్స్, డీల్స్ వివరాలు ఇవిగో!

Flipkart Big Saving Days Start From 2nd May 12am To 8th May Offers

  • వచ్చే నెల 3 నుంచి ప్రారంభం
  • ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్లకు ఒకరోజు ముందు నుంచే అవకాశం
  • ఎస్బీఐ కార్డ్ తో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్

ఎలక్ట్రానిక్ పరికరాలపై అదిరిపోయే డీల్స్, డిస్కౌంట్లతో ఫ్లిప్ కార్ట్ మరోసారి బిగ్ సేల్ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు బిగ్ సేవింగ్ డేస్ పేరుతో స్పెషల్ సేల్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులు ఒకరోజు ముందే అంటే.. మే 2 నుంచే ఈ సేల్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఇప్పుడు ఇస్తున్న 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఈ సేల్ లో వర్తిస్తుందని ప్రకటించింది.

ఎస్బీఐ కార్డు యూజర్లు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ చెల్లింపులపైనా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాదు.. ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ తో రూ.లక్ష వరకు కొనుగోళ్లు చేయొచ్చని, ఆపై వాయిదాల్లో చెల్లింపులు జరిపే అవకాశం కల్పించినట్లు వివరించింది. అయితే, ఏయే వస్తువులపై ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చేది కంపెనీ వెల్లడించలేదు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించే అవకాశం ఉందని సమాచారం.

More Telugu News