Anasuya: అత్త పాత్రల కోసం అడిగినవారికి ఆ మాటనే చెప్పాను: అనసూయ

Aanasuya Interview

  • వెండితెరపై బిజీగా ఉన్న అనసూయ 
  • నటన ప్రధానమైన పాత్రలకి ఓకే 
  • పాత్రలను రిపీట్ చేయడం ఇష్టం ఉండదని వెల్లడి 
  • శివగామి తరహా పాత్రలను చేయాలనుందని వ్యాఖ్య 
       


వెండితెరపై అనసూయ తన జోరును కొనసాగిస్తూ వెళుతోంది. తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయ అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. " జీవితంలో నేను పెద్దగా ప్లాన్ చేసుకోను .. లెక్కలు వేసుకోను. కాకపోతే నా కెరియర్ ఎక్కడ మొదలైంది .. ఎక్కడి వరకూ వచ్చింది అనేది మాత్రం అప్పుడప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉంటాను" అని అంది. 

" స్పెషల్ సాంగ్స్ చేయకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలా నేను టీవీ తెరపై సందడి చేశాను గనుక, నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను .. అలాగే ముందుకు వెళుతున్నాను. నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్రలను నేను రిపీట్ చేయడానికి అంతగా ఇష్టపడను" అని చెప్పింది. 

"రంగమ్మత్త పాత్ర చేసిన తరువాత హీరోయిన్స్ కి అత్తగా చేయమని కొంతమంది అడిగారు. సినిమా రిలీజ్ తరువాత అంతా నా పాత్ర గురించి మాట్లాడుకునేలా ఉంటే అత్త పాత్ర చేస్తానని చెప్పాను. అంటే 'శివగామి' తరహాలో అంతటి పవర్ఫుల్ గా ఆ పాత్ర ఉండాలనేది నా ఉద్దేశం. ప్రస్తుతం ఒక వైపున ఫ్యామిలీని .. మరో వైపున సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్నాను" అని అంది. 
 

Anasuya
Actress
Tollywood
  • Loading...

More Telugu News