Kodali Nani: కొడాలి నాని నామినేషన్ ను తిరస్కరించాలని టీడీపీ ఫిర్యాదు

TDP complains RO to reject Kodali Nani nomination
  • తాను ఏ ప్రభుత్వ భవనాన్ని వినియోగించలేదని అఫిడవిట్ లో తెలిపిన కొడాలి నాని
  • మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించారన్న టీడీపీ
  • అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం ఏర్పడింది. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకి ఇచ్చినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాను వినియోగించలేదని అఫిడవిట్ లో నాని పేర్కొన్నారని చెప్పారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో నాని నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

Kodali Nani
Affidavit
YSRCP
Telugudesam

More Telugu News