IPL 2024: హైదరాబాద్ పరాజయం.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్!

- ఉప్పల్ వేదికగా ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్
- ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో జట్టు యజమాని కావ్యా మారన్ తీవ్ర నిరాశ
- ఆమె హావభావాల ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
నిన్న ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేయడంతో ఆ జట్టు యజమాని కావ్యా మారన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. భారీగా పరుగులు సమర్పించుకోవడం, అనవసరపు షాట్లకు వెళ్లి వికెట్లు పారేసుకోవడంతో ఆమె కోపం, బాధ చూపించారు. ప్రస్తుతం ఆమె హావభావాల ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్స్‌ప్రెషన్లలో వింటేజ్ కావ్యా మారన్ బ్యాక్ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
