Minister Roja: మంత్రి రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

AP minister Roja Questioned by SBI Puram Voters
  • తమ సమస్యలు పరిష్కరించలేదని నిలదీత
  • రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలు
  • చేసేదేంలేక వెనుదిరిగిన వైసీపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోజాను ముందుకు వెళ్లనీయలేదు. సర్దిచెప్పేందుకు చూసినా వారు వినిపించుకోకపోవడంతో చేసేదేంలేక మంత్రి రోజా వెనుదిరిగారు. ప్రచారం చేయకుండానే వచ్చేశారు.
Minister Roja
Andhra Pradesh
YSRCP
Assembly Elections
AP Assembly Polls
SBI Puram

More Telugu News