Jagan: కాసేపట్లో పులివెందులకు చేరుకోనున్న సీఎం జగన్.. భారీ భద్రత

Jagan to file nomination today

  • నేడు నామినేషన్ వేయనున్న జగన్
  • భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • పులివెందులలోని తన నివాసంలో కాసేపు గడపనున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్... అక్కడి నుంచి కడపకు చేరుకున్నారు. కడప నుంచి హెలికాప్టర్ లో పులివెందులకు బయల్దేరారు. కాసేపట్లో ఆయన పులివెందులకు చేరుకుంటారు. 

పులివెందులలో నిర్వహించే భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. స్థానిక సీఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తాడేపల్లికి బయల్దేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా పులివెందులలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Jagan
Pulivendula
Nomination
YSRCP
AP Politics
  • Loading...

More Telugu News