Congress: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress announces three lok sabha candidates
  • ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డికి టిక్కెట్
  • కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీ
  • హైదరాబాద్ నుంచి బరిలోకి దిగుతున్న మహమ్మద్ సమీర్
నామినేషన్ గడువు ముగియనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి మహమ్మద్ సమీర్‌లను బరిలోకి దింపుతోంది.

తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఏప్రిల్ 18న ప్రారంభమైన నామినేషన్ దాఖలు ప్రక్రియ 25న ముగుస్తుంది. ఏప్రిల్ 26వ తేదీన స్క్రూటీని ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 17 లోక్ సభ స్థానాల్లో మే 13న ఒకేదఫాలో పోలింగ్ పూర్తవుతుంది.
Congress
Lok Sabha Polls
Khammam District
Karimnagar District
Hyderabad

More Telugu News