RBI: కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ షాక్

  • క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ
  • ఐటీ రిస్క్ మేనేజ్మెంట్‌లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో చర్యలు
  • 2022, 2023 సంవత్సరాల్లో లోపాలను గుర్తించిన కేంద్ర బ్యాంకు

 కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు విధించింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీ నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్‌లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో కేంద్రబ్యాంకు ఈ చర్యలు చేపట్టింది.

ఆర్బీఐ ఐటీ పరిశీలనలో వరుసగా రెండేళ్లు లోపాలు వెలుగు చూశాయి. 2022, 2023 సంవత్సరాల్లో ఆర్బీఐ గుర్తించిన లోపాలను కోటక్ మహీంద్రా బ్యాంకు సమగ్రంగా... సమయానుకూలంగా పరిష్కరించడంలో విఫలం కావడంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ అండ్ డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటెజీ వంటి అంశాల్లో లోపాలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ విషయంలో 2022, 2023 సంవత్సరాల్లో మార్గదర్శకాలు పాటించలేదని తెలిపింది.

  • Loading...

More Telugu News