Sathya Prakash: చిరంజీవి కారు కొనిపెట్టారు: విలన్ సత్య ప్రకాశ్

Sathya Prakash Interview

  • విలన్ గా మెప్పించిన సత్య ప్రకాశ్ 
  • 'బిగ్ బాస్' సినిమాతో మెగాస్టార్ తో పరిచయం 
  • తన విషయంలో చిరంజీవి కేర్ తీసుకున్నారని వెల్లడి 
  • ఆయన కొనిపెట్టిన కారు అలాగే ఉందని వివరణ 


సత్యప్రకాశ్ .. తెలుగు తెరకి తనదైన విలనిజం చూపించిన నటుడు. వివిధ భాషల్లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు. అలాంటి సత్య ప్రకాశ్ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను పుట్టింది విజయనగరంలో .. మొదటి నుంచి కూడా నేను చిరంజీవి గారికి అభిమానిని" అని అన్నారు. 

"చిరంజీవిగారితో కలిసి మొదటిసారిగా నేను 'బిగ్ బాస్' సినిమాలో చేశాను. ఆ సినిమా సెట్లోనే నాకు నేనుగా చిరంజీవిగారిని పరిచయం చేసుకున్నాను. వారం రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాను. చిరంజీవిగారి కాంబినేషన్లో ఫైట్స్ చేసేటప్పుడు, నా విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునేవారు. నాకు దెబ్బలు తగలకుండా ఆయన కేర్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది" అని చెప్పారు. 

" ఈ వారం రోజుల పాటు నేను పాత స్కూటర్ పై రావడం .. వెళ్లడం చేశాను. హెల్మెట్ లేకుండా స్కూటర్ నడపడం ప్రమాదమని ఆయన నన్ను హెచ్చరించారు. నాకు కారు కొనిపెడతానని అన్నారు. అలాగే మారుతి కారు కొనిపెట్టారు. ఆ తరువాత చాలా కార్లు మార్చానుగానీ, మెగాస్టార్ ఇచ్చిన కారు ఇప్పటికీ అలాగే ఉంది" అని అన్నారు.

Sathya Prakash
Actor
Chiranjeevi
  • Loading...

More Telugu News