Ashish: దెయ్యంతో రొమాన్స్ .. 'లవ్ మీ' రిలీజ్ డేట్ ఖరారు!

Love Me Release Date Confirmed

  • ఆశిష్ హీరోగా రూపొందిన 'లవ్ మీ'
  • ఆయన జోడీ కట్టిన వైష్ణవీ చైతన్య 
  • సంగీతాన్ని అందించిన కీరవాణి 
  • మే 25వ తేదీన సినిమా విడుదల   


ఇంతవరకూ దెయ్యాలు ఉన్నాయా లేవా? అనే ఒక ఆసక్తికరమైన సందేహం చుట్టూ కథలు తిరిగాయి. తమ వాళ్లు దెయ్యం బారిన పడితే రక్షించుకోవడం అనే ఒక ఉత్కంఠభరితమైన అంశం చుట్టూ కథలు తిరిగాయి. ఇక ఇప్పుడు దెయ్యలతో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ముందుకు వెళ్లే ఒక హీరో కథగా 'లవ్ మీ' సినిమా రూపొందింది.

ఆశిష్ హీరోగా అరుణ్ ఈ సినిమాను రూపొందించాడు. 'బేబి' హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేసుకున్నారు. 

అలాంటి ఈ సినిమాను మే 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 'బేబి' తరువాత వైష్ణవి చైతన్య చేసిన సినిమా ఇది. అందువలన సహజంగానే సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందమైన హీరోయిన్ తనవెంట పడుతుంటే .. హీరో దెయ్యం వెంటపడటమే చిత్రమైన పాయింట్. మరి ఈ కథలో ఉన్న మేజిక్ ఏమిటనేది సినిమా విడుదలైతేనేగానీ తెలియదు.

More Telugu News