Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ మామూలు ఛాన్స్ కొట్టలేదుగా!

Aishwarya Rajesh Special

  • తమిళంలో దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేశ్ 
  • మలయాళంలోను మంచి గుర్తింపు 
  • శివరాజ్ కుమార్ సినిమాతో కన్నడలోను ఎంట్రీ 
  • ఆ సినిమాలో హైలైట్ గా నిలవనున్న 'దుర్గ' పాత్ర

ఐశ్వర్య రాజేశ్ .. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తెలుగులోను 'కౌసల్య కృష్ణ మూర్తి' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' .. 'రిపబ్లిక్' వంటి సినిమాలను చేసింది. ఇక ఓటీటీలో వచ్చిన 'ఫర్హానా' .. 'డ్రైవర్ జమున' సినిమాల ద్వారా ఆడియన్స్ కి మరింత చేరువైంది. చాలా కాలం క్రితమే మలయాళ ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య రాజేశ్, తాజాగా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఐశ్వర్య రాజేశ్ పరిచయమవుతున్నది శివరాజ్ కుమార్ సినిమాతో కావడమే ఇక్కడి విశేషం. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా దర్శకుడు రోహిత్ పడకి ఒక సినిమా చేస్తున్నాడు .. ఆ సినిమా పేరే 'ఉత్తరకాండ'. టైటిల్ తోనే ఈ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. కంటెంట్ ఏమై ఉంటుందా అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 

ఈ సినిమాలో 'దుర్గ' అనే కీలకమైన పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. పోస్టర్ తోనే ఈ సినిమా చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేశ్ కన్నడలోను బిజీ అవుతుందేమో చూడాలి. 

Aishwarya Rajesh
Shiva Raj Kumar
Rohith
  • Loading...

More Telugu News