Devineni Uma: చంద్రబాబు సీఎంగా ప్రభుత్వం ఏర్పడితేనే ఏపీకి భవిష్యత్తు: దేవినేని ఉమ

Devineni fires on Jagan

  • విధ్యంసం, దోపిడీ వైసీపీ సర్కార్ విధానాలన్న ఉమ
  • రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శ
  • కూటమి సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని జోస్యం

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విధ్వంసం, దోపిడీ వైసీపీ సర్కార్ విధానాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. యువతకు జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని చెప్పారు. రాష్ట్రాన్ని ఏలుతున్న అరాచకశక్తిని ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఎన్టీయే కూటమి సృష్టించే సునామీలో జగన్ అరాచక ప్రభుత్వం కొట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Devineni Uma
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
AP Politics
  • Loading...

More Telugu News