Vijay Devarakonda: విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గకపోవడానికి కారణం అదే!

Vijay Devarakonda Special

  • ఉప్పెనలా దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ 
  • యాటిట్యూడ్ ద్వారా ఎక్కువ మార్కులు కొట్టేసిన హీరో 
  • ఈ మధ్య దాగుడు మూతలాడుతున్న విజయం 
  • అయినా ఏ ప్రాంతంలోను తగ్గని ఓపెనింగ్స్ 
  • సరైన హిట్ కోసం వెయిటింగ్ 


ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పరిచయమవుతూనే ఉంటారు. ఇక బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది. ఒక వైపున ఆల్రెడీ బరిలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలను .. మరో వైపున కొత్తగా దూసుకొచ్చే న్యూ టాలెంట్ ను హీరోలందరూ ఫేస్ చేయవలసిందే. ఇక్కడ క్రేజ్ మాత్రమే కాదు విమర్శలూ వినిపిస్తాయి. రికార్డులు మాత్రమే కాదు ఫ్లాపులు కూడా పలకరిస్తాయి. అలాంటి పరిస్థితిని తట్టుకుని నిలబడటమే అసలైన హీరోయిజం అని నిరూపించినవారు కూడా లేకపోలేదు. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం విషయంలో అతను విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా 'ఫ్యామిలీ స్టార్' కూడా అతనిని కాపాడలేకపోయింది. అయితే నిజానికి 'ఫ్యామిలీ స్టార్' అంత తీసికట్టుగా ఏమీ ఉండదు. 'గీత గోవిందం' సినిమా స్థాయిలో ఊహించుకుని వెళ్లడం వలన కొంత నిరాశను కలిగించవచ్చు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా స్టైల్ గా కనిపించాడు. చాలా నేచురల్ గా చేశాడు కూడా.  విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ వచ్చిన విధానమే వేరు. 50 శాతం ఆయన యాక్టింగ్ వైపు నుంచి మార్కులు తెచ్చుకుంటే, మరో 50 శాతం మార్కులను తన యాటిట్యూడ్ ద్వారా తెచ్చుకున్నాడు. ఆయన మాటల్లో కొంతమందికి అహంభావం ధ్వనిస్తే .. మరికొందరికి అమాయకత్వం కనిపిస్తుంది. ఏమీ దాచుకోకుండా మాట్లాడే ఆయన తీరే అమ్మాయిల్లో క్రేజ్ ను నిలబెట్టేసింది. ఆయన ఏ సినిమా సరిగ్గా ఆడకపోయినా, ఆ తరువాత సినిమాకి యూత్ పోటెత్తుతూనే ఉంది. ఆయన ఫ్లాపులను గురించి కాకుండా, ఆ తరువాత చేయనున్న ప్రాజెక్టు పట్ల వాళ్లంతా ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు కారణం విజయ్ దేవరకొండను తమ ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తూ ఉండటమే.  

Vijay Devarakonda
Actor
Family Star
  • Loading...

More Telugu News