Sharmila: పీసీసీ చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు

EC issues notice to Sharmila

  • వివేకా హత్య ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు
  • షర్మిలపై ఫిర్యాదు చేసిన మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి, దస్తగిరి
  • కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలన్న ఎన్నికల సంఘం
  • 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం నేడు నోటీసులు జారీ చేసింది. 

షర్మిల తన ప్రచారంలో వివేకా హత్యపై ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఫిర్యాదులు అందాయి. షర్మిలపై వైసీపీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి, వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదులు చేశారు. 

ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం...  షర్మిలకు నోటీసులు పంపింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో స్పష్టం చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.

Sharmila
Notice
EC
Congress
Andhra Pradesh
  • Loading...

More Telugu News