Raghu Babu: నల్గొండ రోడ్డు ప్రమాదం... సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు

Actor Raghu Babu gets bail

  • బుధవారం సాయంత్రం నెల్లూరు వెళుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తను ఢీకొన్న రఘుబాబు కారు
  • ఘటనాస్థలంలోనే మృతి చెందిన సందినేని జనార్ధన్ రావు
  • ప్రమాదస్థలంలో అదుపులోకి తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేసిన పోలీసులు
  • ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడంతో బెయిల్ పొందిన రఘుబాబు

రోడ్డు ప్రమాదం కేసులో సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదయింది. నటుడిని అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారులో హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్‌కు బైక్‌పై వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్‌ రావు(49)ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వెంటనే సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈరోజు నల్గొండ జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు.

Raghu Babu
Telangana
Nalgonda District
Road Accident
  • Loading...

More Telugu News