Russian Culture Ministry: మెగాస్టార్ చిరంజీవితో రష్యా ప్రతినిధుల భేటీ.. వీడియో ఇదిగో!
![Russian Culture Ministry high level delegation mets Megastar Chiranjeevi](https://imgd.ap7am.com/thumbnail/cr-20240419tn6622586b0f594.jpg)
- హైదరాబాద్ కు వచ్చిన రష్యా సాంస్కృతిక శాఖ బృందం
- రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్ లకు ప్రోత్సాహంపై చిరంజీవితో చర్చ
- వీలైన సహకారం అందించేందుకు సిద్ధమని హామీ
విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిశారు. బుధవారం హైదరాబాద్ కు వచ్చిన ఈ ప్రతినిధి బృందం.. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర సీమకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240419fr6622584572f0a.jpg)
రష్యాలో షూటింగ్.. సహకారంపై..రష్యాలో భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాల షూటింగ్ లకు సంబంధించి రష్యా సాంస్కృతిక మంత్రిత్వ బృందం చిరంజీవితో చర్చించింది. అక్కడ తెలుగు సినిమాల షూటింగ్ లను ప్రోత్సహించేందుకు, వీలైన సహకారం అందించేందుకు సిద్ధమని రష్యా ప్రతినిధులు చిరంజీవితో పేర్కొన్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240419fr66225850d7c04.jpg)
మెగాస్టార్‌ను కలిసిన వారిలో రష్యా సాంస్కృతిక శాఖ మంత్రికి సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చర్కెజ్, యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్ స్కయా, ఇతర సీనియర్ సభ్యులు ఉన్నారు. చిరంజీవితో రష్యా బృందం భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.