Telugudesam: విజయనగరం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన 500 కుటుంబాలు

500 people joined in TDP in Viziangaram from YCP
  • మెరకముడిదాం మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వలసలు
  • మండల రాజకీయాలను శాసించే తాడ్డి, కోట్ల కుటుంబాల చేరికతో టీడీపీలో జోష్
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి కమిడి కళా వెంకట్రావు
విజయనగరం జిల్లాలో అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న మెరకముడిదాం మండలంలో పార్టీ ప్రధాన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. గత రాత్రి గర్భాం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు తాడ్డి కృష్ణారావు కుమారులు చంద్రశేఖర్ (చందు) వెంకటేశ్, ఎంపీటీస సభ్యరాలు తాడ్డి కృష్ణవేణి ఆధ్వర్యంలో గర్భాం, నరసయ్యపేట, బోడందొరవలస, పెదమంత్రిపేట, చినమంత్రిపేట, లెంకపేట, భైరిపురం, చల్లాపురం, రామయ్యవలస, మెరకముడిదాం గ్రామాలకు చెందిన  దాదాపు 500 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 

చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మెరకముడిదాం మండల రాజకీయాలను శాసిస్తూ వచ్చిన తాడ్డి, కోట్ల కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది.
Telugudesam
Vizianagaram
Chipurupalle
Kimidi Kala Venkata Rao
Meraka Mudidam

More Telugu News