Ponnam Prabhakar: తెలంగాణకు వినోద్ కుమార్ ఏం చేశారో, బీజేపీ ఏం చేసిందో చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar fires at BJP and BRS
  • కరీంనగర్ జిల్లా అలుగునూరులో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి
  • గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని వెల్లడి
  • రైతులకు పంట బోనస్ తప్పకుండా ఇస్తామన్న పొన్నం ప్రభాకర్
కరీంనగర్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు పంట బోనస్ తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.
Ponnam Prabhakar
BJP
BRS
Lok Sabha Polls

More Telugu News