Kanappa: నయన్ .. అనుష్క .. కాజల్ .. ఇంతకీ 'కన్నప్ప'లో ఎవరు?

Kannappa movie update

  • షూటింగు దశలో ఉన్న మంచు విష్ణు 'కన్నప్ప'
  • భారీ తారాగణంతో ఆసక్తినిరేపుతున్న ప్రాజెక్టు
  • పరమశివుడిగా కనిపించనున్న అక్షయ్ కుమార్  
  • పార్వతీదేవి పాత్ర కోసం వినిపిస్తున్న స్టార్ హీరోయిన్స్ పేర్లు


మంచు విష్ణు కథానాయకుడిగా 'కన్నప్ప' సినిమా రూపొందుతోంది. ఆయన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తూ ఉండటం వలన, వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. అలా ఇప్పటికే ఈ సినిమా కోసం మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. అక్షయ్ కుమార్ .. శరత్ కుమార్ లను తీసుకున్నారు. ఇక కథానాయికల విషయానికి వస్తే ఒక వైపున 'కన్నప్ప' భార్య పాత్ర .. మరో వైపున శివుడి అర్థాంగిగా పార్వతి పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉండనుంది. ఈ నేపథ్యంలో పార్వతీదేవి పాత్ర ఎవరు పోషించనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ క్రమంలోనే నయనతార .. అనుష్క పేర్లు వినిపించాయి. ప్రభాస్ శివుడిగా కనిపిస్తే పార్వతీదేవిగా అనుష్క ఖాయమని అంతా అనుకున్నారు. అయితే శివుడి పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడనే ఒక క్లారిటీ వచ్చేసింది. అలాగే పార్వతీదేవి పాత్రకి గాను కాజల్ పేరు వినిపిస్తోంది. దాదాపు ఆమెను ఖరారు చేశారనే టాక్ బలంగా ఉంది. నిజానికి నిడివి పరంగా చూస్తే, చాలా తక్కువ నిడివి కలిగిన పాత్రనే ఇది. అందువలన నయన్ .. అనుష్క చేయనంటే కాజల్ ను తీసుకున్నారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. ఈ ముగ్గురిలో పార్వతీదేవి ఎవరనే విషయంలోనే ఇప్పుడు క్లారిటీ రావలసి ఉంది. 

Kanappa
Vishnu
Nayanthara
Anushka
Kajal Agarwal
  • Loading...

More Telugu News