Devineni Uma: శవ రాజకీయాలు చేయడం జగన్ నైజం: దేవినేని ఉమ

Devineni Uma fires on Jagan

  • ఏపీలో కూటమిదే గెలుపని అన్ని సర్వేలు చెపుతున్నాయన్న దేవినేని ఉమ
  • ఓటమి భయంతో గులకరాయి డ్రామాకు జగన్ తెరలేపారని విమర్శ
  • బాబును సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం శవ రాజకీయాలు చేసే నైజం జగన్ దని ఆయన విమర్శించారు. అన్ని సర్వేలు ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించబోతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఓటమి భయంతోనే గులకరాయి డ్రామాకు జగన్ తెరలేపారని ఎద్దేవా చేశారు. ఫ్రస్ట్రేషన్ లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జగన్ అరాచక పాలనకు చరమగీతం పలికి, రామరాజ్య స్థాపన కోసం చంద్రబాబును సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరోవైపు ఈ రోజుతో నామినేషన్ల పర్వం మొదలు కాబోతోంది. వివిధ పార్టీల అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో నామినేషన్లు ఎక్కువగానే దాఖలయ్యే అవకాశం ఉంది.

Devineni Uma
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News