First Phase: ఈ నెల 19న దేశంలో తొలి దశ ఎన్నికలు... నేటితో ముగిసిన ప్రచారం

First phase elections will be held on April 19

  • దేశంలో సార్వత్రిక ఎన్నికలు
  • మొత్తం 7 దశల్లో ఎన్నికలు
  • ఎల్లుండి మొదటి విడతలో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు
  • 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు


దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి.  ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్  జరగనుంది. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది. 

అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు... కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎల్లుండి పోలింగ్ నిర్వహించనున్నారు. 

కాగా, తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ లో 12 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో లోక్ సభ స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News