IPL 2024: హార్దిక్ పాండ్యాకు నమ్మకం, నైపుణ్యం రెండూ లేవని తేలింది: ఇర్ఫాన్ పఠాన్
![Irfan Pathan Criticizes Hardik Pandya Captaincy](https://imgd.ap7am.com/thumbnail/cr-20240415tn661d1e197c260.jpg)
- చెన్నైతో మ్యాచులో ఓటమి తర్వాత మరోసారి హార్దిక్‌పై తీవ్ర విమర్శలు
- ముంబై పరాజయానికి పాండ్యానే ప్రధాన కారణమని ఫ్యాన్స్ మండిపాటు
- ఇదే విషయమై 'ఎక్స్' ద్వారా స్పందించిన ఇర్ఫాన్ పఠాన్
ఆదివారం నాటి చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులో ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచులో ముంబై పరాజయానికి పాండ్యానే ప్రధాన కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతని సారథ్యంపై మాజీ క్రికెటర్లు కూడా పెదవి విరుస్తున్నారు.
ఇదే విషయమై తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ 'ఎక్స్' (ట్విటర్) ద్వారా స్పందించాడు. "పాండ్యా ఆఖరి ఓవర్‌లో బౌలింగ్ చేయడమనేది ఆకాశ్ మధ్వాల్‌పై అతనికి నమ్మకం లేదనే విషయాన్ని తెలియజేసింది. అలాగే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే నైపుణ్యం హార్దిక్‌కు లేదని తేలింది" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.