MLA Chittibabu: వైసీపీకి రాజీనామా చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు

P Gannavaram Mla Chittibabu Joined Congress Today
  • పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిక
  • వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో షర్మిలను కలిసిన చిట్టిబాబు 
  • షర్మిల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న వైనం   
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ప్రచారం నిర్వహిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే చిట్టిబాబు పార్టీ మారడం విశేషం. పి.గన్నవరం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన కొండేటి చిట్టిబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీలో ఇమడలేక రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ వెంటనే షర్మిలను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
MLA Chittibabu
Andhra Pradesh
AP Elections
P.Gannavaram
YSRCP
Chittibabu Congress

More Telugu News