Manda Krishna Madiga: కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను అణగదొక్కుతోంది: మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం

Manda Krishna Madiga fires at congress government
  • షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు కాబట్టి సలహాలు మాత్రమే ఇవ్వాలి.. పొగడటం చేయవద్దని సూచన
  • మోత్కుపల్లి నర్సింహులుకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? అంటూ ప్రశ్న 
  • బాబు జగ్జీవన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి దామోదర రాజనర్సింహను ఎందుకు ఆహ్వానించలేదని నిలదీత  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగలకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను అణగదొక్కుతోందని ఆరోపించారు.

మరో పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రివర్గంలో నలుగురు రెడ్లకు అవకాశమిచ్చి... ఒక్క ముస్లింకూ చోటివ్వకపోయినా అడగడం లేదని... పైగా పదేళ్లు ఆయనే సీఎంగా ఉంటాడని షబ్బీర్ అలీ చెప్పడం విడ్డూరమన్నారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు కాబట్టి సలహాలు మాత్రమే ఇవ్వాలని... పొగడటం కాదన్నారు.

మోత్కుపల్లి నర్సింహులుకు అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? బాబు జగ్జీవన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి దామోదర రాజనర్సింహను ఎందుకు ఆహ్వానించలేదు? కేసీఆర్ కేబినెట్లో ముస్లిం వర్గానికి చెందినవారు ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు... కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ లేరు ఎందుకు? వీటికి సమాధానం చెప్పాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు.
Manda Krishna Madiga
Revanth Reddy
Congress
Lok Sabha Polls

More Telugu News