AP Intermediate Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
![AP Intermediate Results Released Today on 11AM](https://imgd.ap7am.com/thumbnail/cr-20240412tn66188a991bf54.jpg)
- శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్న ఇంటర్ బోర్డు
- ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల
- పరీక్షలు రాసిన 9.99 లక్షల మంది విద్యార్థులు
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఒకేషనల్, రెగ్యులర్ కలిపి ఫస్టియర్ 5,17,617 మంది విద్యార్థులు, సెకండియర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో పొందవచ్చు.