Nara Lokesh: కోయంబత్తూరు చేరుకున్న నారా లోకేశ్

Nara Lokesh arrives Coimbatore

  • కోయంబత్తూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై
  • ఎన్డీయే పెద్దల సూచనతో అన్నామలై తరఫున లోకేశ్ ప్రచారం
  • కోయంబత్తూరులోని తెలుగువారి మద్దతు కోరనున్న లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులోని కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు లోక్ సభ స్థానం అభ్యర్థి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరఫున లోకేశ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొననున్నారు. 

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ కూడా ఎన్డీయేలో భాగమైంది. ఈ నేపథ్యంలో, లోకేశ్ సేవలను తెలుగువారు అధికంగా ఉండే కోయంబత్తూరులో ఉపయోగించుకోవాలని ఎన్డీయే పెద్దలు భావించారు. వారి సూచన మేరకు లోకేశ్ కోయంబత్తూరు వెళ్లారు. 

లోకేశ్ ఈ రాత్రికి ఎన్డీయే సభలో పాల్గొని, రేపు ఉదయం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. కోయంబత్తూరు ఎంపీ స్థానం బీజేపీ అభ్యర్థి అన్నామలైకి మద్దతు ఇవ్వాలని స్థానిక తెలుగు ప్రజలను లోకేశ్ కోరనున్నారు.

Nara Lokesh
Coimbatore
Annamalai
BJP
NDA
TDP-JanaSena-BJP Alliance
Tamil Nadu
Andhra Pradesh
  • Loading...

More Telugu News