Nara Lokesh: కోయంబత్తూరు బయలుదేరిన నారా లోకేశ్... తమిళనాడులో బీజేపీ కోసం ఎన్నికల ప్రచారం

Nara Lokesh off to Coimbatore for BJP Campaign

  • ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన టీడీపీ
  • కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి అన్నామలై తరఫున లోకేశ్ ప్రచారం
  • తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లోకేశ్ ప్రచారం
  • ఈ రాత్రి పీలమేడు సభకు హాజరు
  • రేపు సింగనల్లూర్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో... కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, లోకేశ్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరారు. అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేశ్ ప్రచారం చేయనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 

రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమై అన్నామలై విజయానికి సహకరించాలని కోరతారు. అనంతరం కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరిగొస్తారు. 

రేపు సాయంత్రం యథావిధిగా మంగళగిరి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

Nara Lokesh
Coimbatore
BJP
Annamali
Lok Sabha Polls
NDA
TDP
Tamil Nadu
Andhra Pradesh
  • Loading...

More Telugu News