Ramzan Celebrations: ఒకే ఫ్రేమ్‌లో త‌ళుక్కున మెరిసిన సానియా మీర్జా, స్మితా స‌బ‌ర్వాల్‌.. నెట్టింట ఫొటోల వైర‌ల్‌!

Smita Sabharwal Ramzan Celebrations with Sania Mirza

  • రంజాన్ సంద‌ర్భంగా సానియా మీర్జాను క‌లిసిన స్మితా స‌బ‌ర్వాల్‌
  • ఆ స‌మ‌యంలో క‌లిసి దిగిన ఫొటోల‌ను ఇన్‌స్టా వేదిక‌గా పంచుకున్న ఐఏఎస్ ఆఫీస‌ర్‌
  • ఈద్ ముబార‌క్ హైద‌రాబాదీస్ అంటూ ఫొటోలు పోస్ట్ చేసిన స్మిత

రంజాన్ పండ‌గ సంద‌ర్భంగా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, ఐఏఎస్ అధికారిణి స్మితా స‌బ‌ర్వాల్ క‌లుసుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సానియాతో కలిసి దిగిన ఫొటోల‌ను స్మిత త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. #ఈద్ ముబార‌క్, #రంజాన్ ముబార‌క్‌, #హైద‌రాబాదీస్ వంటి హ్యాష్ ట్యాగుల‌తో ఫొటోల‌ను ఐఏఎస్ ఆఫీస‌ర్ పంచుకున్నారు. ఇక ఒకే ఫ్రేమ్‌లో త‌ళుక్కున మెరిసిన సానియా, స్మితల‌ను చూసిన‌ నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.     


View this post on Instagram

A post shared by Smita Sabharwal (@smita_sabharwal1)

  • Loading...

More Telugu News