Murali Mohan: నేను .. నా భార్య చేసిన పూజల ఫలితమే ఇది: మురళీమోహన్

Muralimohan Interview

  • తన అసలు పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పిన మురళీమోహన్   
  • ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత హీరోగా ఇండస్త్రీకి వచ్చానని వెల్లడి  
  • కొడుకు లాంటి అల్లుడు, కూతురు లాంటి కోడలు దొరికారని హర్షం  

మురళీమోహన్ క్రమశిక్షణతో విజయాలను ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు. హీరోగా గట్టిపోటీని ఎదుర్కుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగాను అనేక సక్సెస్ లను చూసిన ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. 

"మా నాన్నగారికి దేశభక్తి ఎక్కువ. అందువలన రాజా రామ్మోహన్ రాయ్ అనే పేరు నాకు పెట్టారు. ఆ తరువాత సినిమాల కోసం మురళీమోహన్ గా మార్చుకోవలసి వచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నేను హీరోగా ఇండస్త్రీకి వచ్చాను. సక్సెస్ అయితే కొన్ని సినిమాలు చేద్దాం .. లేదంటే వెనక్కి వెళ్లిపోదాం అనుకున్న నేను, ఇంతకాలం ఇండస్ట్రీలో నిలబడ్డానంటే నిజంగా అది అదృష్టంగానే నేను భావిస్తున్నాను" అన్నారు. 

"మొదటి నుంచి కూడా నాకు భక్తి ఎక్కువ. నాకంటే ఎక్కువగా మా ఆవిడ పూజలు చేస్తుంది. మా పూజలు ఫలించడం వలన కొడుకు లాంటి అల్లుడు, కూతురు లాంటి కోడలు దొరికారు. ఈ రోజున మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకు కారణం మేము చేసుకున్న పూజలనే నేను నమ్ముతూ ఉంటాను" అని చెప్పారు. 

More Telugu News