Sri Vishnu: ఈ శుక్రవారం ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!

- ఈ నెల 12 నుంచి జీ 5లో 'గామి' స్ట్రీమింగ్
- డిఫరెంట్ లుక్ తో విష్వక్ మెప్పించిన సినిమా
- అదే రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో 'ఓం భీమ్ బుష్'
- హాస్యంతో అలరించిన కంటెంట్
- ఆహా నుంచి పలకరించనున్న 'ప్రేమలు'
- రొమాంటిక్ లవ్ స్టోరీతో మార్కులు కొట్టేసిన మూవీ
ఈ శుక్రవారం ఓటీటీ సెంటర్ లో సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది. మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో 'గామి' .. 'ఓం భీమ్ బుష్' .. 'ప్రేమలు' కనిపిస్తున్నాయి. విష్వక్సేన్ హీరోగా విద్యాధర్ రూపొందించిన 'గామి', మార్చి 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. విభిన్నమైన సినిమాగా ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రానుంది.

