Andhra Pradesh: హృదయవిదారక ఘటన.. కొడుకు మృతదేహంతో తండ్రి 8 కిలోమీటర్ల నడక!
![Father walk 8KM with Son Dead Body in Andhra Pradesh](https://imgd.ap7am.com/thumbnail/cr-20240410tn6615e7607b32c.jpg)
- గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మధ్యలోనే దించేసి వెళ్లిపోయిన అంబులెన్స్ డ్రైవర్
- సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కొడుకు మృతదేహాన్ని మోసుకుని నడక సాగించిన తండ్రి
- ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీలో ఘటన
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కొడుకు మృతదేహంతో తండ్రి ఏకంగా 8 కిలోమీటర్లు నడిచాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండల పరిధిలోని రొంపల్లి పంచాయతీ చినకోనెలకు చెందిన సార కొత్తయ్య కుటుంబంతో కలిసి గుంటూరు జిల్లా కొల్లూరు వద్ద ఇటుకల బట్టీలో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఆయన చిన్న కుమారుడు ఈశ్వరరావు(3) సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేసుకున్నారు. అయితే, అంబులెన్స్ డ్రైవర్ వారిని మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ వద్ద దించేసి వెళ్లిపోయాడు. ఇక అక్కడి నుంచి గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో మృతదేహాన్ని మోసుకుని కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.