Stock Market: చరిత్ర సృష్టించిన సెన్సెక్స్.. 75 వేల మార్క్ ను టచ్ చేసిన సెన్సెక్స్
- దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు
- 75,125 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్
- 24 సెషన్లలో వెయ్యి పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త చరిత్రను సృష్టించింది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 75 వేల మార్క్ ను టచ్ చేసింది. ఈ ఉదయం సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదయం 22,765 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... ఆ తర్వాత ఐటీ, రియాల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సరికొత్త శిఖరాలను చేరుకుంది. 75,125 పాయింట్లను టచ్ చేసింది.
మార్చి 6న 74 వేల మార్క్ ను తాకిన సెన్సెక్స్... కేవలం 24 సెషన్లలోనే 75 వేల మార్క్ ను తాకింది. 24 సెషన్లలోనే వెయ్యి పాయింట్లు పెరిగింది. మరోవైపు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో... లాభాలు తగ్గాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 74,770 పాయింట్ల వద్ద... నిఫ్టీ 22,695 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.