Chandrababu: అహంకారంతో విర్రవీగుతున్న కౌరవ మూకను తరిమికొడదాం: చంద్రబాబు

TDP Chief Chandrababu Tweet

  • బురఖా తొలగించి మహిళను అవమానించిన వైసీపీ నేత
  • అదేమని ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి
  • నందికొట్కూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి తీరుపై టీడీపీ చీఫ్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మైనారిటీ మహిళ బురఖాను తొలగించి అవమానించిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. నందికొట్కూరులో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ బురఖా తొలగించడాన్ని ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేశారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు కౌరవులుగా మారిపోయారని అన్నారు. ఈ ఘటన వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని చెప్పారు. మత ఆచారాలను గౌరవించని, మహిళల మనోభావాలకు విలువివ్వని ఈ కౌరవ మూకను తరిమి కొడదామని, మే 13న అన్ని వర్గాలు ఏకమై ప్రజాగ్రహం అంటే ఏంటో వైసీపీ నేతలకు చూపించాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

సత్తెనపల్లిలో నేడు ప్రజాగళం..
పౌరుషాల గడ్డ పల్నాడు జిల్లాలోని క్రోసూరు, సత్తెనపల్లిలో శనివారం జరుగుతున్న ప్రజాగళం సభలకు వేలాదిగా తరలిరావాలని చంద్రబాబు కోరారు. మోసపు పునాదులపై జగన్ నిర్మించుకున్న అప్రజాస్వామిక సామ్రాజ్యం మరి కొద్దిరోజుల్లో కూలిపోతుందనే భరోసాను రాష్ట్ర ప్రజలకు కల్పిద్దామని టీడీపీ అధినేత ట్వీట్ చేశారు.

Chandrababu
TDP Chief
YSRCP
nandikotkuru
muslim women
burakha
  • Loading...

More Telugu News