Nara Lokesh: అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావు జగన్ రెడ్డీ!: నారా లోకేశ్

Nara Lokesh fires on CM Jagan

  • కడప జిల్లాలో శ్రీనివాసులు అనే వ్యక్తి హత్య
  • ఓ పత్రికలో వచ్చిన కథనంపై తీవ్రస్థాయిలో స్పందించిన లోకేశ్
  • అందుకేనా నా బీసీలు, నా బీసీలు అంటావు అని గ్రహం 

జగన్ ఇలాకాలో మరో బీసీ వ్యక్తి హత్య అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అంతులేని భూ దాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలితీసుకుంటావు జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. నీ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఠా బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి, ఆయనను అత్యంత దారుణంగా హతమార్చిందని లోకేశ్ ఆరోపించారు. కాపాడాల్సిన ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచాడని మండిపడ్డారు. బీసీల భూములు లాక్కుని, చంపేందుకేనా... నా బీసీలు, నా బీసీలు అంటావ్ జగన్ రెడ్డీ? అని నిలదీశారు.

Nara Lokesh
Jagan
Ravindranath Reddy
Kadapa District
TDP
YSRCP
  • Loading...

More Telugu News