Jagan: ఏడో రోజుకు చేరుకున్న జగన్ 'మేమంతా సిద్ధం' యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదిగో!

Jagan Memantha Siddham 7th day schedule
  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ఏడో రోజు యాత్ర
  • సాయంత్రం పూతలపట్టులో బహిరంగసభ
  • రాత్రికి రేణిగుంట సమీపంలో బస
మరోసారి విజయమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమయింది. ఈరోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు (మొధిగారిపల్లె) వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో... చిత్తూరు జిల్లా సిద్ధమా? అని జగన్ ట్వీట్ చేశారు.

Jagan
Memantha Siddham
YSRCP
AP Politics

More Telugu News