Janasena: రిజిస్టర్డ్ పార్టీగానే జనసేన.. ఫ్రీ సింబల్ గా గాజు గ్లాసు గుర్తు

Janasena party symbol Glass is in free symbol list

  • గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితా విడుదల చేసిన ఈసీ
  • గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైసీపీ, టీడీపీ
  • వైసీపీకి ఫ్యాన్, టీడీపీకి సైకిల్ గుర్తులు

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో పార్టీల జాబితాను విడుదల చేశారు. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైసీపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తును కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈసీ ఉంచింది. ఇది జనసేనను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణల సలహా తీసుకోవాలని భావిస్తోంది.

More Telugu News