Miyapur Metro Rail: మెట్రో రైల్ డిపోలో అగ్నిప్రమాదం

Fire Accident at Miyapur Metro Rail Depot Today

  • మియాపూర్ డిపోలోని డంప్ యార్డ్ లో ఎగసిపడ్డ మంటలు
  • మంగళవారం ఉదయం ఘటన.. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
  • ప్రమాదంపై దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

మియాపూర్ లోని మెట్రో రైల్ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డిపోలోని చెత్త డంపింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో రైల్ సిబ్బంది.. పైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కాగా, అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు మెట్రో రైల్ అధికారులు ఆరా తీస్తున్నారు.

Miyapur Metro Rail
Metro Rail Depot
Fire Accident
Hyderabad
  • Loading...

More Telugu News