Pawan Kalyan: పిఠాపురంలో పవన్ బిజీబిజీ.. ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు

- నేడు నాలుగో రోజు పర్యటిస్తున్న జనసేనాని
- ప్రార్థనల అనంతరం పొన్నాడ బషీర్ బీబీ దర్గాకు పవన్
- రేపు తెనాలిలో పర్యటన..12 వరకు తీరికలేని షెడ్యూల్
రానున్న ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం అవుతారు. కాగా, పిఠాపురంలో పవన్ నాలుగో రోజు పర్యటనలో బీజీగా గడుపుతున్నారు.


