Andhra Pradesh: ఏపీ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు

Special observer arrives AP

  • ఏపీలో మే 13న ఎన్నికలు
  • ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ
  • నేడు రాష్ట్రానికి చేరుకున్న రామ్మోహన్ మిశ్రా
  • మిగిలిన ఇద్దరు పరిశీలకులు రేపు రాష్ట్రానికి రానున్న వైనం

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను పంపాలని నిర్ణయించింది. పోలీసులు, సాధారణ, ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో నేడు ఈసీ ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా ఏపీకి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్వాగతం పలికారు. మిగిలిన ఇద్దరు పరిశీలకులు రేపు (ఏప్రిల్ 2) రాష్ట్రానికి రానున్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నుంచి సన్నద్ధం కానుంది.

Andhra Pradesh
Elections
Special Observers
ECI
  • Loading...

More Telugu News