Raghunandan Rao: రైతుల కష్టాలు కేసీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా?: రఘునందన్ రావు ఆగ్రహం

Raghunandan Rao fires at KCR

  • ఆయన సీఎంగా ఉన్నప్పుడు వారి ఇబ్బందులు తెలియవా? అని ప్రశ్న
  • వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా
  • సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మెదక్‌తో ఏం సంబంధమని ప్రశ్న

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు కేసీఆర్‌కు తెలియదా? ఇప్పుడు వారి ఇబ్బందులు గుర్తుకు వచ్చాయా? అని బీజేపీ మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ జిల్లాల పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు. గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రైతులు ఉరివేసుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు, మెదక్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆయనకు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదన్నారు. కుక్కలను, నక్కలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుందని కేసీఆర్ అంటున్నారని... మరి గతంలో వారినే తన పార్టీలో చేర్చుకున్నప్పుడు ఏమయింది? అని రఘునందన్ రావు నిలదీశారు.

Raghunandan Rao
BJP
Telangana
KCR
  • Loading...

More Telugu News